IEDs : ఐఈడీల కలకలంపై దర్యాప్తునకు సిట్

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : అసోంలోని పలు ముఖ్య నగరాల్లో ఆగస్టు 15న ఐఈడీలు లభ్యమైన ఘటనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.

IEDs : ఐఈడీల కలకలంపై దర్యాప్తునకు సిట్
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోంలోని పలు ముఖ్య నగరాల్లో ఆగస్టు 15న ఐఈడీలు లభ్యమైన ఘటనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఈవిషయాన్ని అసోం స్పెషల్ డీజీపీ హర్మీత్ సింగ్ ఆదివారం వెల్లడించారు. సిట్‌కు అదనపు ఎస్‌పీ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించిన వారెవరైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. అసోం నగరాల్లో ఆగస్టు 15న ఐఈడీలను అమర్చిన వారి సమాచారాన్ని అందించిన వారికి రూ.5 లక్షల రివార్డును అందిస్తామన్నారు.

Next Story