Elon Musk: మస్క్ చేతికి గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు..!

by Shamantha N |

అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ సూచించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టు బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ చేతికే వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Elon Musk: మస్క్ చేతికి గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ సూచించిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టు బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ చేతికే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. స్పేస్ఎక్స్‌ ఈ ప్రాజెక్ట్‌ పొందేందుకు సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ పలాంట్రి పీఎల్‌టీఆర్‌.ఓ, డ్రోన్‌ నిర్మాణ కంపెనీ ఆండురిల్‌తో కలిసి బిడ్‌ వేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ గోల్డెన్‌ డోమ్‌ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉన్నా.. పెంటగాన్‌ మాత్రం స్పేస్‌ఎక్స్‌ గ్రూప్‌ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ట్రంప్‌ కార్యవర్గం, పెంటగాన్‌లోని అధికారులతో భేటీ అయి వారి ప్లాన్‌ను వెల్లడించినట్లు సమాచారం. భూమిపై క్షిపణుల కదలికలను తక్షణం గుర్తించేలా దాదాపు 400 నుంచి వెయ్య ఉపగ్రహాలను మోహరించాలన్నది వీరి ఉద్దేశం. ఇవికాకుండా అమెరికా వైపు వస్తున్న ముప్పుపై దాడి చేసేందుకు మరో 200 క్షిపణులు, లేజర్‌ ఆయుధాలను మోహరించాలని పేర్కొన్నారు. కాకపోతే ఉపగ్రహాలను ఆయుధీకరించే ఈ ప్రాజెక్టులో మాత్రం స్పేస్‌ఎక్స్‌ భాగం కాదు.

మస్క్ ఏమన్నారంటే?

మరోవైపు, క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రాజెక్టులో స్పేస్‌ఎక్స్‌ భాగస్వామి అవుతోందన్న వార్తలపై మస్క్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ గోల్డెన్‌డోమ్‌ కు సంబంధించిన ఎటువంటి కాంట్రాక్ట్‌ కోసం స్పేస్‌ఎక్స్‌ ప్రయత్నించడం లేదు. మానవులను మార్స్ పైకి తీసుకెళ్లడం మీదనే మా దృష్టి ఉంది. ఇక ట్రంప్ ఈ విషయంలో సాయం కోరితే.. మేం చేస్తాం. కానీ, మేం కాకుండా ఇతర కంపెనీలు కూడా ఈ పని చేయగలవు’’ అని పోస్టు చేశారు మకోవైరు. గోల్డెన్‌ డోమ్‌కు సంబంధించి స్పేస్‌ఎక్స్‌ కు సంబంధించిన ప్రతిపాదనను పెంటగాన్‌ ముందుంచినట్లు సమాచారం. ఈ క్షిపణి రక్షణవ్యవస్థకు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ అమలుచేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని ప్రభుత్వం వాడుకుంటే డబ్బు చెల్లించాలనేది దాని సారాంశం. భారీ రక్షణ ప్రాజెక్టులో ఇలాంటి చెల్లింపుల విధానంపై కొందరు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు దాదాపు 180 కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు పెంటగాన్‌కు తెలిపాయి.

Next Story