Axiom-4 : స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక ప్రయోగం వాయిదా

by Muthe.Rajitha |

స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక(SpaceX Dragon Spacecraft) ప్రయోగం అర్థాంతరంగా వాయిదా పడింది.

Axiom-4 : స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక ప్రయోగం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమనౌక(SpaceX Dragon Spacecraft) ప్రయోగం అర్థాంతరంగా వాయిదా పడింది. స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ ప్రయోగం రేపు సాయంత్రం 5.50 గంటలకు జరగాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణ్(ISRO Chairman Narayan) ప్రకటించారు. రేపు సాయంత్రం జరగాల్సిన ప్రయోగం బుధవారానికి వాయిదా వేసినట్టు వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5.50 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లనుంది. యాక్సియం-4(Axiom-4) మిషన్‌ పేరుతో నాసా(NASA), ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

ఈ ప్రాజెక్టులో భారత ఆస్ట్రోనాట్ శుభంశు శుక్లా(Shubhanshu Shukla) మిషన్ పైలట్ గా వ్యవహరిస్తారు. శుభంశుతోపాటు మరో ముగ్గురు విదేశీ ఆస్ట్రోనాట్స్ కూడా ఈ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అయితే భారత్ నుంచి రోదసీ యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత మళ్ళీ స్పేస్ లోకి అడుగుపెడుతున్న భారతీయుడు శుభంశు కావడం గమనార్హం.

Next Story