ఆ యూట్యూబర్లతో జ్యోతికి లింకులు... హిసర్ ఎస్పీ కీలక ప్రకటన!

by velandi.Saikiran |

పాకిస్తాన్ ( Pakisthan) గూడచారిగా పనిచేసిన జ్యోతి మల్హోత్రా పై ( Jyoti Malhotra ) సంచలన వ్యాఖ్యలు చేశారు హిసర్ ఎస్పీ శశ

ఆ యూట్యూబర్లతో జ్యోతికి లింకులు... హిసర్ ఎస్పీ కీలక ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ( Pakisthan) గూడచారిగా పనిచేసిన జ్యోతి మల్హోత్రా పై ( Jyoti Malhotra ) సంచలన వ్యాఖ్యలు చేశారు హిసర్ ఎస్పీ శశాంక్ కుమార్ ( SP Hisar Shashank Kumar Sawan). పాకిస్తాన్ కు జ్యోతి కి సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలిపోయిందని వివరించాడు. ఆమె పహల్గాం సంఘటన జరగక ముందు చాలాసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చిందని తెలిపాడు.

ఆమెకు మరి కొంత మంది యూట్యూబర్లకు సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలినట్లు పేర్కొన్నాడు. వాళ్ల వివరాలను కూడా బయటకు తీస్తున్నామని స్పష్టం చేశాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన స్పాన్సర్షిప్ డబ్బులతో పాకిస్తాన్ వెళ్లి వచ్చేదని జ్యోతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్పీ శశాంక్. జ్యోతి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని పైన విచారణ చేస్తున్నామని కూడా తెలిపాడు.

పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని వివరించాడు. పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా చాలాసార్లు జ్యోతి వెళ్లినట్లు తమ విచారణలో తేలిందని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ ఆర్మీతో జ్యోతి కి సంబంధాలు ఉన్నాయని వివరించాడు. ఇది ఇలా ఉండగా పహల్గాం ఘటన జరగకముందు.. చాలాసార్లు పాకిస్తాన్ కి వెళ్లి వచ్చిన జ్యోతి... ఇండియన్ సమాచారం మొత్తం పాకిస్తాన్ వాళ్లకు తెలియజేసింది. జనవరిలోనే పహల్గాం సందర్శించిన జ్యోతి.. అక్కడ ఉన్న లూప్ హోల్స్ మొత్తం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా... హర్యానాలో జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు పోలీసులు.

Next Story