- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Monsoon: చల్లని కబురు.. అండమాన్‌ను తాకిన నైరుతి.. తెలంగాణకు ఎప్పుడంటే..
మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) అండమాన్, నికోబార్ దీవులతో (Andaman and Nicobar Islands) పాటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) అండమాన్, నికోబార్ దీవులతో (Andaman and Nicobar Islands) పాటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు మొత్తం, సౌత్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకూ విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.
మే 14న అండమాన్ కు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతం (Southeast Bay of Bengal)లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది అల్పపీడనం (Low Pressure)గా మారితే ఏపీ వ్యాప్తంగా మే నెలాఖరు వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. 13,14 తేదీల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, 15వ తేదీన రాయలసీమ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న మూడ్రోజుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
మే27 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. జూన్ 12వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకనున్నట్లు తెలిపింది. నైరుతి త్వరగా పలకరిస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఇంకొల్లులో 43.5, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.






