- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
South: సౌత్ ఇండియన్స్ సంస్కృతిని పాడు చేస్తున్నారు.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సౌత్ ఇండియన్స్ పై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ ఇండియన్స్ (South Indians) పై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay ghaikwad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్‌లు, లేడీస్ బార్ లను నడుపుతున్నారని, కాబట్టి వారికి మహారాష్ట్రలో ఫుడ్ సప్లై కాంట్రాక్ట్స్ ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘శెట్టి అనే కాంట్రాక్టర్‌కు కాంట్రాక్ట్ ఎందుకిచ్చారు? మరాఠీ వ్యక్తులకు ఇవ్వండి. మనం ఏమి తింటామో వారికి తెలుసు. కాబట్టి వారు మనకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్, లేడీస్ బార్‌లను నడుపుతారు. మహారాష్ట్ర సంస్కృతిని పాడు చేస్తారు. వారు మన పిల్లలను సైతం భ్రష్టు పట్టించారు’ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు గైక్వాడ్ కుళ్లిన పప్పు, రైస్ వడ్డించడంతో కొలాబాలోని ఓ హోటల్‌లో క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ వివాదంతో ప్రభుత్వం క్యాంటీన్‌ను రద్దు చేసింది.






