- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెర్రర్ మాంజా.. గాలిపటాలపై రైల్వేశాఖ కీలక విజ్ఞప్తి
సంక్రాంతి పండుగొస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో గాలిపటాల సందడి కనిపిస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగొస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కానీ.. ఈ గాలిపటాన్ని ఎగురవేసేందుకు చైనా మాంజా వాడుతుండటం ప్రాణాలమీదికి తీసుకొస్తుంది. గాలిపటాల కోసం మాంజా వాడొద్దని ఇప్పటికే పోలీసులు సూచించారు. కానీ పలు ప్రాంతాల్లో ఈ మాంజాను ఇంకా అమ్ముతున్నారు. అది కంటికి కనిపించనంత సన్నగా ఉండటంతో.. బైక్ పై వెళ్లేవారు తరచూ ప్రమాదానికి గురవుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లైన్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయవద్దని, పండుగ వేళ ప్రమదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రైల్వే లైన్ల మీదుగా వెళ్లే 25కేవీ హైటెన్షన్ వైర్లకు మాంజా తగిలితే ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గత సంక్రాంతి సీజన్లో ట్రాక్ ల వద్ద పతంగులు ఎగురవేస్తూ పలువురు విద్యుద్ఘాతానికి గురైన విషయాన్ని రైల్వే అధికారుల గుర్తు చేశారు. మాంజాలో రసాయనిక పదార్థాలు, మెటాలిక్ ఉండటం వల్ల అవ విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని వివరించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని షంషీర్ గంజ్ ప్రాంతంలో జమీల్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ బైక్ వెళ్తుండగా చైనా మాజా మెడకు చుట్టుకుంద. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. 22 కుట్లు పడ్డాయి. దీంతో ఎమ్మెలయే దాం నాగందర్ కీలక ప్రకటన చేశారు. మాంజా అమ్ముతున్నవారు గురించి సమాచారమిస్తే రూ.5000 రివార్డు ఇస్తానని ప్రకటించారు.






