శబరిమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల 13వ తేదీ నుంచే

by velandi.Saikiran |

శబరిమలకు వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. శబరిమల వెళ్లే వాళ్ల కోసం ప్రత్యేకంగా రైళ్లు ప్రారంభం కా

శబరిమల భక్తులకు గుడ్‌ న్యూస్‌..ఈ నెల 13వ తేదీ నుంచే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: శబరిమలకు వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. శబరిమల వెళ్లే వాళ్ల కోసం ప్రత్యేకంగా రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి శబరి వెళ్లే భక్తుల కోసం ఏకంగా 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని కూడా పేర్కొంది.

ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్‌ నుంచి కొల్లాం, చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలాగే హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి కొల్లాం వరకు కూడా ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే తిరుగు ప్రయాణ రైళ్లు జనవరి 2వ తేదీ వరకు నడుస్తాయని కూడా క్లారిటీ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ప్రకటనతో శబరిమల వెళ్లే భక్తులకు ఊరట లభించనుంది.

Next Story