- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CEC జ్ఞానేష్ కుమార్‌కు దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్ పర్సన్ ఫోన్
దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్‌పర్సన్ మోసోతో మోప్యా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఈరోజు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్‌పర్సన్ (Chairperson of the South African Electoral Commission) మోసోతో మోప్యా, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar)కు ఈరోజు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 75 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్న బీహార్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి దక్షిణాఫ్రికా నుంచి ఈ ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి.
ఈ సందర్భంగా మోప్యా.. జ్ఞానేష్ కుమార్‌తో మాట్లాడుతూ.. “ప్రపంచంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంది. మీ ఎన్నికల ప్రక్రియ మాకు ఆదర్శం,” అని పేర్కొన్నారు. అదనంగా, దక్షిణాఫ్రికా పార్లమెంటేరియన్లు త్వరలో భారతదేశాన్ని సందర్శించి, భారత ఎన్నికల వ్యవస్థ (ECI) పనితీరును ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. జ్ఞానేష్ కుమార్ ఈ కాల్‌ను “ఆత్మీయమైన- ప్రోత్సాహకరమైన సంకేతం”గా అభివర్ణిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రెండు దేశాలు మరింత సన్నిహితంగా పనిచేయాలని ఆకాంక్షించారు.






