Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో అడ్మిట్ !

by B.Srinivas |

కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో సర్ గంగా రామ్ ఆస్పత్రిలో గురువారం అడ్మిట్ అయ్యారు.

Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో అడ్మిట్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి (Sir ganga ram hospital) లో గురువారం అడ్మిట్ అయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా ఆస్పత్రిలో జాయిన్ అయినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ‘ఉదర సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తాం’ అని సర్ గంగా రామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ (Ajay Swaroop) తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఒకరోజు తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అంతేగాక అరోగ్య కారణాల వల్ల గతేడాది డిసెంబర్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశానికి సైతం సోనియా హాజరు కాలేదు.

Next Story