సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత

by velandi.Saikiran |   (  Updated:2026-03-24 23:53:08  IST  )

సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి అస్వస్థత నెలకొంది. మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురైన ఆమె ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో సోనియా గాంధీ వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా ఉన్నారు. అయితే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఢిల్లీలో వాతావ‌ర‌ణ మార్పులు చోటు చేసుకున్న నేప‌థ్యంలో ఆమె శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డిన‌ట్లు స‌మాచారం. అలాగే ఛాతికి సంబంధించిన స‌మ‌స్య కూడా త‌లెత్తిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ప్ర‌స్తుతానికి సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని, ఎవ‌రూ టెన్ష‌న్ ప‌డొద్ద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్న‌ట్లు స‌మాచారం.



Next Story