లద్దాఖ్‌లో అల్లర్లు.. పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్, లైసెన్స్ రద్దు

by Naga Rani Yarlagadda |

లద్దాఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజుల క్రితం అక్కడ రాష్ట్ర హోదా కోరుతూ అల్లర్లు జరిగాయి.

లద్దాఖ్‌లో అల్లర్లు.. పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్, లైసెన్స్ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: లద్దాఖ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజుల క్రితం అక్కడ రాష్ట్ర హోదా కోరుతూ అల్లర్లు జరిగాయి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో.. ఈ అల్లర్ల వెనుక పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ ఉన్నారన్న అనుమానాలు రేకెత్తాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా ఇటీవల ప్రకటన చేయడంతో.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. వాంగ్ చుక్ ప్రకటనల వల్లే లేహ్ లో హింసాత్మక ఘటనలు జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటనలో పేర్కొంది. సోనమ్ వాంగ్ చుక్ ఎన్జీఓ లైసెన్సు కూడా క్యాన్సిల్ చేశారు.

కాగా.. లద్దాఖ్ కు రాష్ట్రహోదా ఇవ్వాలని కొద్ది రోజులుగా అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాంగ్ చుక్ రెండువారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్ ను ఆరవ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు - పోలీసులకు మధ్య జరిగిన గొడవల్లో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. లద్దాఖ్ ఆందోళనకు తానే మూలకారణమంటూ చెప్పడాన్ని వాంగ్ చుక్ తప్పుపట్టారు. ప్రధాన సమస్యను పక్కనపెట్టి.. తనను టార్గెట్ చేసి బలి పశువును చేస్తున్నారని ఆరోపించారు.

Next Story