Viral: తల్లి మృతదేహానికి ఉన్న వెండి గాజుల కోసం అంత్యక్రియలను అడ్డుకున్న కొడుకు

by Prasad Jukanti |   (  Updated:2025-05-16 07:46:03  IST  )

తల్లి చేతికి ఉన్న వెండి గాజుల కోసం తల్లి అంత్యక్రియలను కన్న కొడుకు అడ్డుకున్నాడు.

Viral: తల్లి మృతదేహానికి ఉన్న వెండి గాజుల కోసం అంత్యక్రియలను అడ్డుకున్న కొడుకు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. కని పెంచి పెద్ద చేసిన తల్లి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాల్సిన ఓ కన్న కొడుకే ఆస్తి పై మోజుతో తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడు. తల్లికి చెందిన వెండి గాజులు తనకు ఇవ్వకుంటే ఆమెతో పాటే తనను దహనం చేయాలని చితిపై పడుకుని హంగామ సృష్టించాడు. ఈ ఘటనలకు సంబంధించిన మే 3న జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ (Rajasthan) జైపూర్ సమీపంలో విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల ఓ మహిళ మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర ఆభరణాలను ఇన్నాళ్లు ఆమె సంరక్షణ బాధ్యతలు చూసుకున్న పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు కుటుంబ పెద్దలు అప్పగించారు. అయితే తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని చిన్న కుమారుడు ఓం ప్రకాశ్ పట్టుబట్టాడు. ఈ క్రమంలో తీవ్ర గందరోగళం సృష్టించాడు.

ఇలా చేయడం మంచిది కాదని గ్రామస్తులు అతడిని ఒప్పించాలనే ప్రయత్నం చేసినా వారి మాటలను పట్టించుకోని ఓం ప్రకాశ్ తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని లేకుంటే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకుని బీభత్సం సృష్టించాడు. దీంతో చివరకు ఆభరణాలు అతడికి ఇవ్వడంతో రెండు గంటలు ఆలస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. దీంతో తల్లికంటే ఆభరణాలే ఎక్కువయ్యాయా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Click For Tweet..

Next Story