PM Modi: శౌర్యానికి, పరాక్రమానికి సోమనాథుడు ప్రతీక: ప్రధాని మోడీ

by Prasad Jukanti |   (  Updated:2026-01-11 07:35:22  IST  )

ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ ఆలయం, భారత్ రెండూ నిలబడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

PM Modi: శౌర్యానికి, పరాక్రమానికి సోమనాథుడు ప్రతీక: ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దురాక్రమణ దారులు సోమనాథుడి ఆలయంతో పాటు భారత్‍పై దండయాత్రలు చేసి నాశనం చేయాలని అనేక ప్రయత్నాలు చేసినా ఆలయం, భారత్ రెండూ తట్టుకుని నిలబడగలిగాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమనాథుడి ఆలయం ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదని మన ధైర్య సహసాల ఇతివృత్తం అన్నారు. ఎన్నో సార్లు మందిర స్వరూపాన్ని మార్చేశారు. హత్యలు చేశారు, మహిళలను చెరబట్టారు. కానీ ఈ ఆలయం అన్నింటిని తట్టుకుని నిలబడగలిగిందన్నారు. సోమనాథునిడిని రక్షించిన యోధులకు వందనాలు అన్నారు. గుజరాత్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమనాథ్ స్వాభిమాన పర్వ్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇవాళ ఉదయం సోమనాథ్ ఆలయంలో అభిషేకం చేశారు. అంతకు ముందు శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ శౌర్యయాత్రలో పాల్గొన్న 108 ఆశ్వాలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

ఎగురుతున్న జెండా మన సత్తా చ ాటుతోంది:

వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయంపై దాడి చేసినవారు మనల్ని ఓడించామని భావించారు. కానీ వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ మహాదేవ మందిరంలో ఎగురుతున్న జెండా భారతదేశ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోందని ప్రధాని చెప్పారు. ఇదే స్థలంలో సరిగ్గా వెయ్యేళ్ల క్రితం వాతావరణం ఎలా ఉండేది? ఇక్కడ మన పూర్వీకులు తమ విశ్వాసం కోసం తమ నమ్మకం కోసం మహాదేవుని కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. తమ వద్ద ఉన్న ప్రతిదీ త్యాగం చేశారన్నారు. 1000 యేళ్ల క్రితం ఘజినీ మహ్మద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేశారు. ఆ తర్వాత ఎన్నో దాడులను ఈ ఆలయం ఎదుర్కొంది. ఆక్రమణదారులే మట్టిలో కలిసిపోయారని, ఎన్ని దాడులు జరిగినా ఆలయాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు.. మళ్లీ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించుకున్నామన్నారు.

Next Story