అజిత్ పవార్ మరణం వెనుక ఏదో కుట్ర ఉంది : శివసేన ఎంపీ సంజయ్ రౌత్

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. జనవరి 28న బారామతి వద్ద జరిగిన చార్టెట్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరణంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు.

అజిత్ పవార్ మరణం వెనుక ఏదో కుట్ర ఉంది : శివసేన ఎంపీ సంజయ్ రౌత్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. జనవరి 28న బారామతి వద్ద జరిగిన చార్టెట్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరణంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అంశాలను పరిశీలిస్తే.. దీనివెనుక ఏదో సందేహాస్పదంగా జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంపై దర్యాప్తు చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఇదే అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేసింది. రెండుగా చీలిన ఎన్సీపీ విలీనానికి బీజేపీ ఒక అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై ఎన్నో అనుమానాలున్నాయని, వాటన్నింటినీ దర్యాప్తు చేసి.. నిజాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తామన్నారు. దీనివెనుక ఎవరో ఏదో చేశారన్న అనుమానం తామందరిలో బలంగా ఉందన్నారు. ఎన్సీపీ రెండు వర్గాలను కలిపేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారని, చనిపోయే కొద్దిరోజుల ముందుకు కూడా ఎన్సీపీ ఫౌండర్ శరద్ పవార్ తో కీలక చర్చలు జరిపారన్నారు. కానీ కొందరు నేతలు మాత్రం రీయూనిట్ అయ్యేందుకు విముఖత వ్యక్తం చేశారని తెలిసిందన్నారు.

Next Story