Supreme Court: ఆశ్రయం పొందే హక్కు ఆర్టికల్ 21లో ఉంది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 2021 కూల్చివేతలపై సుప్రీంకోర్టు మండిపడింది. కూల్చివేతలకు యూపీ అనుసరించిన విధానాన్ని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

Supreme Court: ఆశ్రయం పొందే హక్కు ఆర్టికల్ 21లో ఉంది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 2021 కూల్చివేతలపై సుప్రీంకోర్టు మండిపడింది. కూల్చివేతలకు యూపీ అనుసరించిన విధానాన్ని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 21తో పౌరులందరికీ ఆశ్రయం పొందే హక్కు ఉంది” అని వెల్లడించింది. ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాన్ని పంపుతాయని పేర్కొంది. ఇది సరిదిద్దవల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. సుప్రీంకోర్టు గతంలో బుల్డోజర్ న్యాయం గురించి తీర్పు వెలువరించిందని ఎత్తి చూపింది. పిటిషనర్లకు నోటీసులకు స్పందించడానికి తగినంత సమయం ఉందని అటార్నీ జనరల్ వాదించినప్పటికీ.. ధర్మాసనం ఆ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. నోటీసును ఎలా అందించారో చెప్పాలని ఏజీని ప్రశ్నించింది.

ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు

కాగా.. ఈ కేసుని హైకోర్టుకు తిరిగి పంపాలన్న అటార్నీ జనరల్ అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. అలా చేయడం వల్ల అనవసరమైన జాప్యాలు జరుగుతాయని పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 21కి వాయిదా వేసింది. మార్చి 2021లో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఐదుగురు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. వివాదాస్పద భూమిపై చెల్లుబాటు అయ్యే లేదా జీవనాధార హక్కును కల్పించడంలో ప్రభుతవం విఫలమైందని అన్నారు. అందువల్ల రాష్ట్ర ఆస్తిని రక్షించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ చర్యను వ్యతిరేకించే హక్కు వారికి లేదంటూ హైకోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీనిపైనే పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

Next Story