Scam Alert : అమ్మాయిలను ఎరగా వేస్తున్న రెస్టారెంట్లు.. వెలుగులోకి భారీ స్కామ్..

by Sujitha Rachapalli |

పూణేలో షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా హనీట్రాప్ జరుగుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువకులను లక్ష్యంగా చేసుకుని కొందరు అమ్మాయిలు డేటింగ్, మీటింగ్ అంటూ పిలుస్తున్నారని.. రెస్టారెంట్లు, లాంజ్‌లకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

Scam Alert : అమ్మాయిలను ఎరగా వేస్తున్న రెస్టారెంట్లు.. వెలుగులోకి భారీ స్కామ్..
X

దిశ, వెబ్‌డెస్క్: పూణేలో షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా హనీట్రాప్ జరుగుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువకులను లక్ష్యంగా చేసుకుని కొందరు అమ్మాయిలు డేటింగ్, మీటింగ్ అంటూ పిలుస్తున్నారని.. రెస్టారెంట్లు, లాంజ్‌లకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి.. కాస్ట్‌లీ ఫుడ్ తిని.. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమవుతారు. అబ్బాయిలపై భారీ బిల్లులు వదిలివేస్తారు. చెల్లించకపోతే బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీనివల్ల బాధితులు ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

- స్కామర్లు సోషల్ మీడియా ద్వారా అబ్బాయిలతో చాట్ చేస్తారు. రెస్టారెంట్లు లేదా బార్లకు ఆహ్వానిస్తారు. ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తారు. ఆ తర్వాత చెప్పకుండానే వెళ్లిపోతారు. బాధితులకు భారీ బిల్లులను వదిలివేస్తారు.

- ఈ స్కామ్ ముఖ్యంగా వాఘోలీ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ఐటీ ఉద్యోగులు తరచూ రాత్రి ఎంటర్‌టైన్మెంట్ సెంటర్‌కు వస్తుంటారు.

- బాధితులు వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు బిల్లులను చెల్లించాల్సి వస్తుంది. తాము తినని, తాగని మద్యం కోసం డబ్బులు పోగొట్టాల్సి వస్తోంది.

- పూణే పోలీసులు ఈ సంఘటనలను దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఈ స్కామ్‌లో భాగస్వామ్యం కలిగి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ.. అరెస్టులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Next Story