- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాగ్రామే జీవితం కాదు..! ఫాలోవర్స్ తగ్గారని ఇన్‌ఫ్లూయెన్సర్ సూసైడ్.. స్పందించిన హీరోయిన్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా (Social media) వాడకం ఈ మధ్య యువతకు వ్యసనంగా మారింది. చాలా మంది యువత వివిధ సామాజిక మాధ్యమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడం, పాపులర్ అవ్వడం కోసం ఏదైనా చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ (Social media influencer Misha Agarwal) సూసైడ్ చేసుకోవడం అందరికి షాకింగ్‌కు గురి చేస్తోంది.
24 ఏళ్ల మిషా అగర్వాల్ ఏప్రిల్ 24న మృతి చెందింది. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు లక్నోలో ఆత్మహత్య చేసుకున్న మిషా.. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను తాజాగా ఆమె కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. లాయర్ కావాలనుకున్న మిషాకు ఇన్‌స్టాగ్రామ్‌పై ఆసక్తి పెంచుకుందని, రీల్స్, పోస్టులతో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుందని తెలిపారు. ఫాలోవర్స్ సంఖ్యను ఒక మిలియన్‌కు చేర్చుకోవాలని కలలు కందని, కానీ ఇటీవల కాలంలో తన ఫాలోవర్స్ క్రమంగా తగ్గుతూ వచ్చారని పేర్కొన్నారు. దీంతో ఆమె కెరీర్ పరంగా దృష్టిసారించలేకపోయిందని, ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. ఇక, మిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం వల్ల తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌లో ఉందని మిష సోదరి ముక్తా అగర్వాల్ చెప్పింది.
ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ఈ టాపిక్‌పై ప్రముఖ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) స్పందించారు. సోషల్‌మీడియాపై ప్రతిఒక్కరికి ఉన్న వ్యామోహం చూసి ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడో భయపడ్డానని తెలిపారు. ఇలాంటి ఘటనను చూడటం నిజంగా బాధాకరం.. నా హృదయం ముక్కలైందన్నారు. జీవితాన్ని మనం ప్రేమించడం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తామని, చుట్టూ ఉన్నవారు చూపించే నిజమైన ప్రేమ కంటే వర్చువల్ ప్రేమకే మొగ్గు చూపుతామని భయపడ్డినట్లు వెల్లడించారు. మనం కష్టపడి ఎన్నో ఏళ్లపాటు చదువుకున్న డిగ్రీలను లైకులు, కామెంట్స్ అధిగమిస్తాయని ఊహించినట్లు వివరించారు. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియానే జీవితం కాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకంపై కట్టడి చేయాలని నెటిజన్లు ప్రభుత్వాలను కోరుతున్నారు.






