Heavy snowfall : హిమాచల్‌లో మంచు దుప్పటి.. 600 రోడ్లు దిగ్బంధం!

by Ramesh Naini |

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ హిమపాతం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు వర్షంతో పర్యాటక రంగానికి కొత్త కళను తెచ్చినప్పటికీ, స్థానిక జనజీవనాన్ని మాత్రం అస్తవ్యస్తం చేస్తోంది.

Heavy snowfall : హిమాచల్‌లో మంచు దుప్పటి.. 600 రోడ్లు దిగ్బంధం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ హిమపాతం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు వర్షంతో పర్యాటక రంగానికి కొత్త కళను తెచ్చినప్పటికీ, స్థానిక జనజీవనాన్ని మాత్రం అస్తవ్యస్తం చేస్తోంది. ప్రధానంగా సిమ్లా, కులు, లాహౌల్-స్పితి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. భారీగా కురిసిన మంచు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 రోడ్లు మూసుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించి, రాకపోకలను పునరుద్ధరించడానికి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.

ఈ పరిస్థితులపై రాష్ట్ర పీడబ్ల్యూడీ (PWD) మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులతో, సంబంధిత శాఖలతో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లను క్లియర్ చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సుమారు మూడు అడుగుల మేర మంచు కురిసిందని, కొన్ని చోట్ల నాలుగు అడుగుల వరకు కూడా నమోదైందని పేర్కొన్నారు. పర్యాటకులు ఈ మంచు వర్షాన్ని ఆస్వాదిస్తుండగా, నిత్యావసరాలు, రవాణా విషయంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది.

Next Story