Smugglers: బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడి.. నాడియా సరిహద్దులో ఉద్రిక్తత

by B.Srinivas |

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు.

Smugglers: బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్ల దాడి.. నాడియా సరిహద్దులో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్లర్లు (Bangledesh smugglers) దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ స్మగ్లర్ మరణించారు. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హల్దేర్‌పారా సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో బంగారం అక్రమ రవాణా జరుగుతుందనే ఇంటలిజెన్స్ సమాచారం మేరకు బీఎస్ఎఫ్ ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వైపు నుంచి ఐదుగురు స్మగ్లర్లు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. వారిని ఆగాలని హెచ్చరించినప్పటికీ వినకుండా ముందుకు వచ్చి బీఎస్ఎఫ్ సిబ్బందిని చుట్టుముట్టి పదునైనా ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో జవాన్లు కాల్పులు జరపగా తీవ్ర గాయాలపాలై ఓ స్మగ్లర్ ప్రాణాలు కోల్పోగా మిగతా వారు బంగ్లాదేశ్‌వైపు పారిపోయారు. ఘటనా స్థలంలో అనేక పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌కు సైతం గాయాలయ్యాయి.

Next Story