రన్నింగ్‌లో విమానం టైర్‌ నుంచి పొగలు.. లక్నోలో ఘటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-16 06:01:28  IST  )

దేశంలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం(Saudi Airlines Plane) టైర్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

రన్నింగ్‌లో విమానం టైర్‌ నుంచి పొగలు.. లక్నోలో ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం(Saudi Airlines Plane) టైర్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున లక్నో(Lucknow)లో ల్యాండింగ్‌ సమయంలో చోటుచేసుకుంది. హజ్‌ యాత్రికులతో జెడ్డా నుంచి ఈ విమానం లక్నో వచ్చింది. పొగలు వచ్చే సమయంలో విమానంలో 250 మంది హజ్‌ యాత్రికులు(Hajj Pilgrims) ఉన్నారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది, అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story