Viral: 15 వేల అడుగుల ఎత్తులో విమానం వెనుక భాగానికి చిక్కుకున్న స్కైడైవర్ పారాచూట్ (వీడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-12-12 07:17:12  IST  )

విమానం వెనుక భాగానికి స్కైడైవర్ పారాచూట్ చిక్కుకుని గాల్లో వేళాడిన షాకింగ్ ఘటన అందరిని షాక్‍కు గురి చేసింది.

Viral: 15 వేల అడుగుల ఎత్తులో  విమానం వెనుక భాగానికి చిక్కుకున్న స్కైడైవర్ పారాచూట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆకాశంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసే సమయంలో ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం వెనుక భాగానికి తాకి చిక్కుకుపోయింది. దీంతో అతడు గాల్లోనే వేలాడిన తీరు అందరిని ఊపిరి బిగబట్టేలా చేసింది. ఆస్ట్రేలియాలోని దక్షిణ కెయిర్న్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్కైడైవింగ్‌లో భాగంగా స్కైడైవర్స్ ఒక్కొక్కరుగా కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ స్కైడైవర్ కిందకు దూకే ప్రయత్నంలో అతడి పారాచూట్ తెరుచుకుని గాలి వేగానికి విమానం వెనుక భాగంలో చిక్కుకుంది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో ఆ స్కైడైవర్ భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తన వద్ద ఉన్న మరో పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందకు దిగగా విమానం కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది.. వీడియో

Next Story