ఫోర్బ్స్ 2025 జాబితాలో ఆరుగురు తెలుగువారు.. అగ్రస్థానంలో దివీస్ అధిపతి

by Naga Rani Yarlagadda |

అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్ లో 100 మంది అత్యంత ధనవంతుల జాబితా - 2025లో ఆరుగురు తెలుగువారు చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్ 2025 జాబితాలో ఆరుగురు తెలుగువారు.. అగ్రస్థానంలో దివీస్ అధిపతి
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్ లో 100 మంది అత్యంత ధనవంతుల జాబితా - 2025లో ఆరుగురు తెలుగువారు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నివేదికలో మరోసారి దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు ముఖేష్ అంబానీ. సుమారు రూ.9.32 లక్షల కోట్ల నికర సంపదతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. దేశంలో అత్యంత ధనవంతుల సంపద గణనీయంగా తగ్గినా.. ఫోర్బ్స్ లిస్టులో ఆరుగురు తెలుగు వ్యాపారవేత్తలు కూడా ఉండటం విశేషం.

దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళి దివి రూ.88,800 కోట్ల సంపదతో దేశంలో 25వ స్థానంలో నిలిచారు. తెలుగువారిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు 83వ స్థానంలో, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి 86వ స్థానంలో, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి 89వ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీకి చెందిన కె.సతీశ్ రెడ్డి 91వ స్థానంలో నిలిచారు.

Next Story