- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sitharaman: ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాలదే హవా.. నిర్మలా సీతారామన్
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు భారత్, చైనాలు మాత్రమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు భారత్, చైనాలు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కొనియాడారు. ప్రపంచ అభివృద్ధిలో ఈ రెండు దేశాలే కీలక పాత్ర పోషించగలవని నొక్కి చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా సీతారామన్ రష్యా, బ్రెజిల్, చైనా దేశాల ఆర్థిక మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. చైనా ఆర్థిక మంత్రి లాన్ ఫోయాన్‌తో భేటీ అనంతరం ఆమె మాట్లాడారు. 2024లో సమర్కండ్‌లో జరిగిన ఏఐఐబీ చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరణలను నడిపించడంతో చైనా, భారత్‌లు ప్రత్యేక స్థానంలో ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య లోతైన భాగస్వామ్యం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహాయపడతాయని తెలిపారు.
రష్యా ఆర్థిక మంత్రి ఆంటన్ సిలువానోవ్‌తో జరిగిన సమావేశంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అధ్యక్షుడు పుతిన్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ రష్యాల దీర్ఘకాలిక భాగస్వామ్యంపై డిస్కస్ చేశారు. అలాగే బ్రెజిల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫెర్నాండో హద్దాద్, ఇండోనేషియా ఉప ఆర్థిక మంత్రి థామస్ జివాండోనోతోనూ సీతారామన్ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.






