- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sitharaman: అక్టోబర్ నాటికి అమెరికాతో తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందం.. కేంద్ర మంత్రి సీతారామన్
ఈ ఏడాది అక్టోబర్ నాటికి యూఎస్‌తో తొలి దశ ఒప్పందం ఖరారు చేసుకోవాలని భావిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కొత్త పరిపాలనా విభాగంతో భారత్ చురుకుగా పని చేస్తోందని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి యూఎస్‌తో తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందం ఖరారు చేసుకోవాలని భావిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఈ ప్రక్రియను సానుకూలంగా ముగించాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. యూఎస్ పర్యటనలో ఉన్న సీతారామన్ అక్కడి ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. ‘అమెరికాతో దీర్ఘ కాలంగా లేక స్వల్ప కాలికంగా సంబంధాలు కొనసాగించడం అనేది కేవలం సుంకాల విషయంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఒక ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకోవడం, అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకరి ప్రయోజనాల దృష్ట్యా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మొదటి దశ ఒప్పందంపై సంతకం చేయాలి’ అని వ్యాఖ్యానించారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతులను అభివృద్ధి చేయడం ద్వారా దీనిని సాధించొచ్చని తెలిపారు. సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి, మాడ్యులర్ న్యూక్లియర్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) వంటి కీలక రంగాల్లో భారత్ పురోగతి సాధించిదని కొనియాడారు.






