- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మస్థలి మిస్టరీ హత్యలపై సిట్ ఏర్పాటు
కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టరీ హత్యల(Dharmasthali Mystery Murders) నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టరీ హత్యల(Dharmasthali Mystery Murders) నేపథ్యంలో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో 1998-2014 మధ్య జరిగిన వందలాది మిస్టరీ హత్యల ఆరోపణలపై నేడు కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ ప్రణవ్ మోహంతి నేతృత్వంలో ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ధర్మస్థలలో పనిచేసిన ఒక మాజీ సానిటేషన్ కార్మికుడు (విసిల్‌బ్లోయర్).. తాను మంజునాథ ఆలయంలో పనిచేస్తున్నపుడు 1995-2014 మధ్య వందలాది మృతదేహాలను (ముఖ్యంగా మహిళలు, మైనర్లు) నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టినట్టు సంచలన విషయాలను బయటపెట్టాడు.
అందుకు సాక్ష్యంగా కొన్ని అస్థిపంజరాలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అయితే అతను కంప్లైంట్ చేసి చాలరోజులే అయినప్పటికీ పోలీసు అధికారులు చూసిచూడనట్టు వదిలేయగా.. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు డిమాండ్ చేస్తూ, సిట్ ఏర్పాటు చేయాలని లెటర్ రాసింది. ఈ క్రమంలో ప్రభుత్వం డాక్టర్ ప్రణవ్ మోహంతి సారధ్యంలో ఐపీఎస్ అధికారులు ఎమ్.ఎన్. అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయామ్ సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటనతో కనబడకుండా పోయిన పలువురు యువతుల తల్లిదండ్రులు పోలీసుల వద్ద ఎంక్వైరీ చేస్తున్నారు.






