బంగారం చోరీ కేసులో కీలక పరిణామం.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్‌

by Naga Rani Yarlagadda |

శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో శబరిమల ఆలయ తంత్రి (పూజారి) కాంతారు రాజీవర్ ను సిట్ అరెస్ట్ చేసింది.

బంగారం చోరీ కేసులో కీలక పరిణామం.. శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో శబరిమల ఆలయ తంత్రి (పూజారి) కాందరారు రాజీవర్ ను సిట్ అరెస్ట్ చేసింది. ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధం, బంగారు దోపిడీలో అతని కీలక ప్రమేయం ఉన్నట్లు సూచించే ఆధారాల ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హెచ్ వెంకటేష్ నేతృత్వంలోని విచారణ బృందం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం వరకూ రాజీవరును విచారించగా.. ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. అరెస్ట్ చేశారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ పరిణామం రాజకీయ దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్దిరోజులుగా విచారణకు రావలసిందిగా రాజీవర్ కు నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడంతో సిట్ అతన్ని అదుపులోకి తీసుకుంది. సదరు తంత్రి సమన్ల నుంచి తప్పించుకుంటున్నారని, అందుకే ఈ కేసులో విచారించేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.

సిట్ సమర్పించిన రెండు ఛార్జ్ షీట్లను ఒకే కేసుగా మార్చడంతో ఈడీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసింది. రెండు ఛార్జ్ షీట్లలో మొత్తం 15 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. శబరిమల ఆలయం బంగారం చోరీ కేసులో సిట్ ఇప్పటి వరకూ 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. PMLA నిబంధనలను అమలు చేయడం ద్వారా.. నేరం వచ్చిన ఆరోపణలను కనిపెట్టేందుకు, మనీలాండరింగ్ ను పరిశీలించేందుకు ఈడీ దర్యాప్తు పరిధిని విస్తృతం చేసింది. విచారణలో నేరం చేసినట్లు తేలితే ఆస్తులను అటాచ్ చేసే అధికారం ఏజెన్సీకి ఉంటుంది.

Next Story