చెల్లి, క్లోజ్ ఫ్రెండ్ మధ్య ఎఫైర్.. హంతకుడిగా మారిన అన్న

by Sujitha Rachapalli |

ఓ సినిమాలో చూసినట్లుగా.. హీరోకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ అతను ఆ హీరో చెల్లితోనే ప్రేమలో పడుతాడు. ఈ లవ్ స్టోరీలో బ్రదర్ విలన్‌గా మారిపోతాడు. ఇదే జరిగింది రియల్ లైఫ్‌లో కూడా.

చెల్లి, క్లోజ్ ఫ్రెండ్ మధ్య ఎఫైర్.. హంతకుడిగా మారిన అన్న
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ సినిమాలో చూసినట్లుగా.. హీరోకు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ అతను ఆ హీరో చెల్లితోనే ప్రేమలో పడుతాడు. ఈ లవ్ స్టోరీలో బ్రదర్ విలన్‌గా మారిపోతాడు. ఇదే జరిగింది రియల్ లైఫ్‌లో కూడా. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నంద నగ్రి ఏరియాకు చెందిన శివమ్‌, కపిల్ మంచి ఫ్రెండ్స్. కానీ కపిల్.. శివమ్ చెల్లెలితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసిన శివమ్.. చాలా డిస్టర్బ్ అయ్యాడు. కపిల్‌ను లేపేసేందుకు డిసైడ్ అయ్యాడు.

ఈ క్రమంలోనే రాత్రి తన తండ్రి పాత బట్టలు కుట్టించేందుకు టైలర్ షాపుకు వచ్చిన కపిల్‌ను చూసిన శివమ్.. అక్కడకు వెళ్లాడు. అతనితో మాట్లాడుతూనే.. సడెన్‌గా పిస్టల్ తీసి కాల్చాడు. చాలా దగ్గరగా కాల్చడంతో చనిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం శివమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Next Story