మీ ఇంట్లో ఎవరెస్ట్ ఫిష్ మసాలా వాడుతున్నారా? అందులో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సీరియస్

by Disha Web Desk 13 |
మీ ఇంట్లో ఎవరెస్ట్ ఫిష్ మసాలా వాడుతున్నారా? అందులో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో:చాలా మంది తమ వంటల్లో ఉపయోగించే పాపులర్ వంట మసాలా బ్రాండ్ ఎవరెస్ట్ కు షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఫిష్ మసాలాలో పురుగుల మందులు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ఫఉడ్ ఎజెన్సీ (ఎస్ఎఫ్ఏ) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశానికి దిగుమతి అయిన మసాలాల్లో ఇథిలిన్ ఆక్సైడ్ అనే పురుగు మందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని అందువల్ల ఈ మసాలాను కొనుగోలు చేసిన వినియోగదారులు వినియోగించవద్దని సూచించింది. వెంటనే రీకాల్ చేయాలని ఆ దేశంలోఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఎస్ఎఫ్ఏ ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇథిలీన్ ఆక్సైడ్ ను ఆహారంలో ఉపయోగించడానికి లేదని, వ్యవసాయంలో సూక్ష్మజీవుల నివారణకు ఉపయోగిస్తారని, ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహార పదార్ధాల్లో ఉపయోగించడానికి సింగపూర్ ఫుడ్ రెగ్యులేషన్స్ అనుమతించదని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. అయితే ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ మేరకు ఎవరెస్ట్ ఫిష్ మసాలా రికాల్ విషయాన్ని పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Next Story

Most Viewed