సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. సమర్థించిన జగదీష్ షెట్టర్

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-25 09:17:07  IST  )

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దూమారం రేపాయి.

సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. సమర్థించిన జగదీష్ షెట్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అవినీతి లింగాయత్ సీఎం’ అంటూ బసవరాజు బొమ్మైనుద్దేశించి ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దూమారం రేపాయి. అయితే సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ శెట్టర్ సమర్ధించారు. ఈ కామెంట్స్ కేవలం బస్వరాజ్ బొమ్మైను ఉద్దేశించి చేసినవి మాత్రమే అన్నారు. అందరు లింగాయత్ సీఎంలపై కాదని క్లారిటీ ఇచ్చారు. చాలా మంది లింగాయత్ నాయకులు కాషాయం పార్టీని వీడరని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ కాంట్రవర్సీ కామెంట్స్ పై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సిద్ధరామయ్య కర్ణాటకను అవమానించరన్నారు. వెంటనే సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story