- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామా మరుసటి రోజే ఢిల్లీకి సిద్ధరామయ్య.. సోనియా, రాహుల్‌తో భేటీ
రాజీనామా చేసిన మరుసటి రోజే సిద్ధరామయ్య ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారం నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. సిద్ధరామయ్య ఢిల్లీలో ప్రత్యక్షమవడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం ఆయన తన కుమారుడు యతీంద్రతో కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వారి అధికారిక నివాసమైన ‘10, జనపథ్’లో కలుసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత సిద్ధరామయ్య నేరుగా అధిష్ఠానంతో భేటీ కావడం వెనుక రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టత కోసమేనని తెలుస్తోంది.
ఈ ఉన్నత స్థాయి సమావేశం కర్ణాటక కాంగ్రెస్‌లో తదుపరి పరిణామాలకు అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును సిద్ధరామయ్య ఇదివరకే నిరాకరించిన నేపథ్యంలో, పార్టీలో ఆయనకు దక్కబోయే తదుపరి ప్రాధాన్యత, భవిష్యత్తు కార్యాచరణపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కర్ణాటకలో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం అధికార మార్పిడి జరిగిన తర్వాత, సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై ఈ చర్చలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






