- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Siddaramaiah: నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి? సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
“అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి?” అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: “అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి?” అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. స్పీకర్ యుటి ఖాదర్‌కు బెదిరింపు కాల్ వచ్చిందంటూ విలేకరుల ప్రశ్నకు సీఎం ఈ విధంగా స్పందించారు. ‘అవును.. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చాము. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని కనుగొని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం’ అని సీఎం సిద్ధరామయ్య మీడియాతో అన్నారు. అంతేకాదు, మంగళూరులో జరిగిన రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య కేసు గురించి కూడా ప్రస్తావించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. “అతను (శెట్టి) రౌడీ షీటర్ అని చెబుతున్నారు. దీన్ని తనిఖీ చేయాలి. హత్య తర్వాత నేను పోలీసులతో మాట్లాడాను. మేం మంగళూరుకు ఏడీజీపీతో ఈ కేసు గురించి చర్చించా” అని ఆయన అన్నారు.
శెట్టి హత్య కేసుపై..
కాగా.. శెట్టి హత్య ముందస్తుగా జరిగిందా లేదా అనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే వివరాలు స్పష్టమవుతాయని సిద్ధరామయ్య అన్నారు. ఇటువంటి ఘటనలను బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా, జమ్ముకశ్మీర్‌లోని పహెల్గామ్ ఉగ్రదాడిపై సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలేవనెత్తారు. ఆ ప్రదేశంలో పోలీసు ఉనికి ఎందుకు లేదని అడిగారు. “ఇది భద్రతా లోపం కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లారా?” అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. మరోవైపు, మంగళూరు (Mangaluru)లో రౌడీ షీటర్ సుహాస్ శెట్టి దారుణ హత్యకు గురయ్యాడు. ఐదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో నడిరోడ్డుపై నరికి చంపేశారు. ఈ ఘటనతో మంగళూరులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలను పట్టుకెళ్లడాన్ని నిషేధించారు. సుహాస్‌ను పథకం ప్రకారమే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.






