భారత యువతకు శుభాన్షు శుక్లా కీలక సందేశం..

by Kema Shiva Kumar |

భారతీయ వ్యోమగామి, ఆక్సియం 4 మిషన్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

భారత యువతకు శుభాన్షు శుక్లా కీలక సందేశం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ వ్యోమగామి, ఆక్సియం 4 మిషన్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత యువతకు శుభాన్షు శుక్లా కీలక సందేశం అందజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను అక్కడికి చేరుకుని అంతరిక్షంలోకి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీకు నా సందేశం ఏమిటంటే.. నేను దీన్ని చేయగలిగితే, మీరు కూడా దీన్ని చేయగలరు. ఒకదాని తర్వాత ఒకటి మిషన్ పూర్తి చేస్తూ మనం ఇక్కడ నుండి ముందుకు సాగాలి. మనకు గగన్‌యాన్ ఉంది, మనకు భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS), వరుస మిషన్లు ఉంటాయి. మీరు కలలు కనాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీన్ని చేయగలరని మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. త్వరలో కలిసి మనం దానిని సాకారం చేసుకుంటాము. "పైకి వెళ్లేటప్పుడు, కక్ష్యలో ఉన్నప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు భారత్ ఇప్పటికీ అంతరిక్షం నుండి చాలా అందంగా కనిపించింది. జై హింద్! జై భారత్!" అని ఆయన తన సందేశాన్ని భారత పౌరులతో పంచుకున్నాడు.

Next Story