- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగోకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు.. 24 గంటల్లో వివరణకు ఆదేశం
ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విమానాలు ఆలస్యం అవ్వడం, రద్దు అవ్వడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విమానాలు ఆలస్యం అవ్వడం, రద్దు అవ్వడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా నేడు సైతం అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. శంషాబాద్ కు రావాల్సిన 54 విమానాలు రద్దయ్యాయి. వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 61 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంతరాయాలపై డీజీసీఏ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది.
ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్నే బాధ్యులను చేస్తూ ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు షోకాజ్ నోటీసు జారీ చేసి 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని నోటీసులో పేర్కొంది. పైలట్ల ఫెటీగ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో కూడా విఫలమైందని పేర్కొంది. సంస్థ సీఈవోగా నమ్మకమైన కార్యకలాపాలు నిర్వహించడంలో విఫలం అయ్యారు అని తీవ్రంగా స్పందించింది.






