- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిని చెంపదెబ్బ కొట్టిన రాపిడో బైక్ రైడర్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?
నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

దిశ,వెబ్‌డెస్క్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో ఓ ర్యాపిడో బైక్ రైడర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేయడం పై ఆ యువతి అతడిని ప్రశ్నించడంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదాం జరిగింది. ఈ క్రమంలో అతడికి డబ్బులు చెల్లించాడనికి సదరు యువతి నిరాకరించింది. ఈ తరుణంలోనే ర్యాపిడో బైక్ రైడర్ సదరు యువతిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనను అక్కడ ఉన్నవారు చూస్తున్నారే తప్ప ఎవరు ఆపలేదు. ఈ నెల(జూన్) 14న జయనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన పై బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






