“ముంబై వెళ్తున్నావంటే మరాఠీ రావాల్సిందే”.. ప్రయాణికుడితో మహిళ వాగ్వాదం

by Ajay Maddhiboyina |

మ‌హ‌రాష్ట్ర‌లో భాషా వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో హిందీ మాట్లాడ‌వ‌ద్ద‌ని, మ‌రాఠీనే మాట్లాడాల‌ని గొడ‌వ‌లు పెట్టుకున్న ప‌లు వీడియోలు వైర‌ల్ అవ్వ‌గా తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

“ముంబై వెళ్తున్నావంటే మరాఠీ రావాల్సిందే”.. ప్రయాణికుడితో మహిళ వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హ‌రాష్ట్ర‌లో భాషా వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో హిందీ మాట్లాడ‌వ‌ద్ద‌ని, మ‌రాఠీనే మాట్లాడాల‌ని గొడ‌వ‌లు పెట్టుకున్న ప‌లు వీడియోలు వైర‌ల్ అవ్వ‌గా తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. కోల్ క‌తా నుండి ఎయిర్ ఇండియా విమానంలో ప్ర‌యాణిస్తున్న ఓ యూట్యూబ‌ర్ తో మ‌హిళ వాగ్వాదానికి దిగింది. నువ్వు ముంబైకి వెళ్లాలి అంటే క‌చ్చితంగా హిందీ నేర్చుకుని ఉండాల‌ని వాదించింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మ‌రాఠీ అర్థం చేసుకోలేనందుకు మ‌హిళ త‌న‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని పేర్కొన్నాడు. భిన్న‌త్వంలో ఏక‌త్వం అని గ‌ర్వంగా చెప్పుకునే దేశంలో ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఒక భాష‌ను ఇత‌రుల‌పై రుద్ద‌లేర‌ని పేర్కొన్నాడు. ఇది కేవ‌లం త‌న‌కు జ‌రిగింది కాద‌ని, మ‌నుషుల మైండ్ సెట్ ఎలా ఉందో చెప్ప‌డానికి నిద‌ర్శ‌నం అని తెలిపాడు. ఎయిర్ ఇండియా యాజ‌మాన్యం మ‌హిళ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు. ఇలాంటి ప్ర‌యాణికులు బ్యాన్ చేయాల‌ని పేర్కొన్నాడు.

Next Story