- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
అమెరికాలో కాల్పులు కలకలం రేపిన నేపథ్యంలో ఏకంగా ఆరుగురు మరణించారు. అమెరికాలోని మిసీసీపీ రాష్ట్రంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో కాల్పులు కలకలం రేపిన నేపథ్యంలో ఏకంగా ఆరుగురు మరణించారు. అమెరికాలోని మిసీసీపీ రాష్ట్రంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. క్లే కౌంటిలో జరిగిన ఈ ఘోర ప్రమాద సంఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉన్న భద్రత సిబ్బంది అలర్ట్ అయింది.
కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అటు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారట. మొత్తం మూడు వేరు వేరు ప్రదేశాల్లో ఈ కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఒకే చోట కాల్పులు జరిగితే, దొరికిపోతానని ప్లాన్ లో భాగంగా మూడు చోట్ల ఒకేసారి కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






