Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మైనర్లు మృతి

by B.Srinivas |

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్ మౌంట్ పార్క్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పలువురిపై కాల్పులు జరిపారు.

Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మైనర్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (America) లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫిలడెల్ఫియా (Philadelphia) లోని ఫెయిర్ మౌంట్ పార్క్ (Fairmount park) లో గుర్తు తెలియని వ్యక్తులు పలువురిపై కాల్పులు జరిపారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. లెమన్ హిల్ డ్రైవ్ లో భాగంగా పార్కులో భారీగా జనం గుమిగూడిన సమయంలో నిందితులు ఫైరింగ్ చేశారని స్థానిక కథనాలు వెల్లడించాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు.

అంతకుముందు సౌత్ కరోలినా (South Karolina) లోని లిటిల్ రివర్ లో వారంతపు పార్టీ జరుపుకుంటున్న వారిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు హోరీ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ ఘటన కన్నా ముందు వాషింగ్టన్ లోని ఇజ్రాయెల్ ఎంబసీలో పని చేసే ఇద్దరు సిబ్బందిని కాల్చి చంపిన విషయం తెలసిందే. దీంతో ప్రతి రోజూ ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతుండటంతో అమెరికాలో ఆందోళన నెలకొంది.

Next Story