- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: దాని కన్నా కాల్చి చంపేయడమే మేలు.. దేశం వీడే ముందు షేక్ హసీనా వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసతో షేక్ హసీనా (Sheikh Hasina) ప్రధాని పదవి నుంచి దిగిపోయి దేశం వీడారు. అప్పట్నుంచి ఆమె భారత్ లోనే తలదాచుకుంటున్నారు

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చెలరేగిన హింసతో షేక్ హసీనా (Sheikh Hasina) ప్రధాని పదవి నుంచి దిగిపోయి దేశం వీడారు. అప్పట్నుంచి ఆమె భారత్ లోనే తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ కు చెందిన క్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపై అరెస్టు వారెంట్‌లు జారీ చేసింది. కాగా.. ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రైబ్యునల్‌కు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో అల్లర్లు తీవ్రమవ్వడంతో గతేడాది ఆగస్టు 4వ తేదీన సైనికాధికారులు హసీనా నివాసానికి వెళ్లి ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు ఇస్లాం పేర్కొన్నారు. అయితే అప్పటి అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు అగ్ర నాయకులు దీనిని వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలని పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి సైతం ఆమెకు సూచించినట్లు చెప్పారు. కానీ, దేశాన్ని వీడాలనే సూచనను హసీనా అంగీకరించలేదన్నారు. పారిపోవడం కంటే తనను అక్కడే కాల్చి చంపేయమని.. గణబంధన్‌లోనే పాతి పెట్టమని సైనికాధికారులను కోరినట్లు తెలిపారు. ఇష్టం లేకపోయినా.. అధికారుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థితుల్లో ఆమె దేశం వీడారని ట్రైబ్యునల్‌కు తెలిపారు.
అల్లర్లు..
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అవి హింసాత్మకంగా మారాయి. వందలాది మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశాన్ని వీడి భారత్‌కు చేరుకొన్నారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరోవైపు హసీనాపై 100కు పైగా కేసులున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ (ICT) ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ భారత్ ని పలుమార్లు కోరింది.






