- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠాలు చెప్పడం మానేసిన మహిళా టీచర్.. జడ విప్పుకొని.. షాకింగ్ వీడియో వైరల్!?
పాఠశాల అంటే దేవాలయంతో సమానం. అక్కడ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: పాఠశాల అంటే దేవాలయంతో సమానం. అక్కడ ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన, క్రీడాలు ఇలా పలు అంశాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు. ప్రశాంతమైన వాతావరణానికి అలవాటైన పిల్లలు ఆడుతూ, పాడుతూ బడికి వెళ్తుంటారు. అయితే, ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘటనలు విద్యార్థుల భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం చూపే విధంగా ఉంటున్నాయి.
పాఠశాలకు వచ్చి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా జడ విప్పుకొని హెడ్‌మసాజ్ చేసుకుంటూ కనిపించారు. ఆ సమయంలో ఫోన్‌లో పాటలు ప్లే చేయడంతో చదువు పై విద్యార్థులు శ్రద్ధ పెట్టలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో పై అధికారులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ తరుణంలో వీడియో వైరల్ కావడంతో అధికారులు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.






