- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వడం దురదృష్టకరం.. ట్రయల్ కోర్టు తీరుపై సుప్రీం ఆగ్రహం
తీవ్రతరం కాని సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ట

దిశ, నేషనల్ బ్యూరో: తీవ్రతరం కాని సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంపై సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టుల Trial courts) తీరుపై విమర్శలు గుప్పించింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయ్యాక బెయిల్(Bail pleas) ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు బట్టింది. ‘‘ఒక ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూడదు. ఇక్కడ నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలుచేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్భందించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తారు. అలా చేయడం ఆమోదయోగ్యం కాదు. రెండు దశాబ్దాల క్రితం.. చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చాలా అరుదుగా వచ్చేవి. ట్రయిల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోంది’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
రెండేళ్లుగా జైళ్లోనే నిందితుడు
దర్యాప్తు పూర్తయి, ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ రెండేళ్లుగా నిందితుడు జైళ్లోనే ఉన్నాడు. అతడి బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు మరియు గుజరాత్ హైకోర్టు రెండూ తిరస్కరించాయి. దీనిపైనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి బెంచ్ బెయిల్ మంజూరుచేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. మేజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు ముందుకుతీసుకురావడం దురదృష్టకరమని అభయ్ ఎస్ ఓకా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను బెయిల్ మంజూరుచేయడంలో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది.






