Operation Sindoor : దడ పుట్టించిన ‘ఆపరేషన్ సింధూర్’.. 30 మంది తీవ్రవాదులు హతం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 03:25:15  IST  )

పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack)కి ప్రతీకారంగా పీవోకే (POK)లోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) దాయాది పాక్‌లో దడ పుట్టించింది.

Operation Sindoor : దడ పుట్టించిన ‘ఆపరేషన్ సింధూర్’.. 30 మంది తీవ్రవాదులు హతం!
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahelgam Terror Attack)కి ప్రతీకారంగా పీవోకే (POK)లోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) దాయాది పాక్‌లో దడ పుట్టించింది. భారత సైన్యం 9 చోట్ల జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, బహవల్‌పూర్‌ (Bahawalpur)లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ (Masood Azhar) హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియా ధృవీకరించినట్లుగా తెలుస్తోంది. కాగా, భారత సైన్యం దాడులను పాక్ సైన్యం కూడా నిర్ధారించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడినట్లుగా వెల్లడించారు.

Next Story