- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. మరో ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య
సాంకేతిక లోపంతో అహ్మదాబాద్ (Ahmadabad)లో విమానం కుప్పకూలి 274 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే దేశంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సాంకేతిక లోపంతో అహ్మదాబాద్ (Ahmadabad)లో విమానం కుప్పకూలి 274 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే దేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ మరో ఎయిరిండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ (Ghaziabad) హిండోన్ ఎయిర్‌పోర్టు నుంచి కోల్‌కతా (Kolkata)కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఉన్నట్టుండి టెక్నికల్ సమస్య ఉత్పన్నమైంది. దీంతో అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు హిండోన్ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. వారందరిని కోల్‌కతాకు తీసుకెళ్లేందుకు ఎయిరిండియా సిబ్బంది మరో ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టేకాఫ్‌కు ముందే సాంకేతిక సమస్య బయటపడటంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.






