రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. అసెంబ్లీలోనే ఆ పని కానిచ్చేసిన మంత్రి(వీడియో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-20 07:44:07  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. అసెంబ్లీలోనే ఆ పని  కానిచ్చేసిన మంత్రి(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుల సమస్యల పై చర్చించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ఎంచక్కా రమ్మీ గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే ఏం పట్టనట్టు వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మంత్రి అసెంబ్లీలో మొబైల్‌లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో వ్యవసాయ మంత్రి రమ్మీ ఆడుతున్న వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని రోహిత్ పవార్ ఆరోపించారు. ఈ క్రమంలో పంట బీమా కోసం, రుణమాఫీ కోసం, పంటలకు మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఈ తరుణంలో అసెంబ్లీలో రమ్మీ ఆటను పక్కన పెట్టి.. పంట పొలాల్లోకి వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు.

Video

Next Story