- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ షాకింగ్ ఘటన.. అధికారిపై వేటు
by Gantepaka Srikanth |
ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సమస్తీపుర్ జిల్లాలో రోడ్డుపక్కన పెద్దమొత్తంలో వీవీప్యాట్ స్లిప్పులు(VVPAT Slips) లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సహాయ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకుంది. ఆయన్ను సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించాలంటూ జిల్లా మేజిస్ట్రేట్‌ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించారు. ఇటీవలే బిహార్‌లో తొలిదశ పోలింగ్ ముగిసింది. 121 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. మలిదశలో 122 స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరగాక ఓట్ల లెక్కింపును 14న చేపడతారు.
Next Story






