చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు

by Kema Shiva Kumar |

చెన్నై ఎయిర్‌పోర్టులో షార్జా-చెన్నై ఎయిర్ అరేబియా విమానం కదులుతుండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఓ ప్రయాణికుడు అమాంతం కిందికి దూకేశాడు.

చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు
X

దిశ, వెబ్‌డె‌స్క్: చెన్నై (Chinnai) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున ఓ వింత ఘటన చోటుచేసుకుంది. షార్జా (Sharjah) నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా (Air Arabia) విమానం రన్‌వేపై నెమ్మదిగా కదులుతుండగా ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి బయటకు దూకేశాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం.. విమానం ల్యాండ్ అయిన తర్వాత మెయిన్ రన్‌వే నుంచి టాక్సీ వే వైపు నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో సదరు ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచి కిందికి దూకేశాడు. అయితే విమానం వేగం తక్కువగా ఉండటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది, విమానానికి కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

అనారోగ్యమే కారణమా..

ప్రాథమిక విచారణలో ఆ ప్రయాణికుడు ప్రయాణమంతటా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. విమానంలో ఉన్న సమయంలో అతడు రెండుసార్లు వాంతులు చేసుకున్నట్లుగా సిబ్బంది గుర్తించారు. అయితే, అనారోగ్యమా, మానసిక ఒత్తిడి వల్లే అతడు ఇలా ప్రవర్తించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పైలట్ గ్రౌండ్ సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Next Story