ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉగ్ర డాక్టర్ ఫోన్ నుంచి కీలక విషయాలు వెలుగులోకి..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-12 06:06:27  IST  )

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉగ్రడాక్టర్లలో ఒకడైన ముజమ్మిల్ ను విచారించగా..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉగ్ర డాక్టర్ ఫోన్ నుంచి కీలక విషయాలు వెలుగులోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ NIAకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉగ్రడాక్టర్లలో ఒకడైన ముజమ్మిల్ ను విచారించగా.. కీలక విషయాలు తెలిశాయి. ముజమ్మిల్ ఫోన్ నుంచి సమాచారాన్ని సేకరించగా.. ఈ ఏడాది జనవరిలోనే బ్లాస్టింగ్ కు రెక్కీ చేసినట్లు తేలింది. అక్టోబర్లో దీపావళి రోజున రద్దీగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు NIA గుర్తించింది. అలాగే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపింది. కాగా.. ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని మెట్రోస్టేషన్ వద్ద సోమవారం (నవంబర్ 10) జరిగిన బాంబ్ బ్లా్స్ట్ లో 12 మంది మరణించగా.. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. పేలుడు ఘటన తర్వాత ఎర్రకోట సమీపంలో రోడ్లు, చాందినీ చౌక్ లో షాపులను పోలీసులు మూసివేయించారు.

కారు అమ్మకంపై అనుమానాలు

కాగా.. ఎర్రకోట పేలుడుకి కారణమైన కారు విషయంలోనూ పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటికొచ్చాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్.. తాను కొన్న i20 కారును ఫోర్త్ హ్యాండ్ లో కొని 10 రోజులపాటు దాచి ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే.. కారు నాలుగు చేతులు మారినా ఓనర్ షిప్ కార్డులు మారకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Next Story