- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: దారుణ ఘటన.. 15 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి
మైనర్ బాలుడిపై తన స్నేహితులే లైంగిక దాడి(Sexually Assaulted)కి పాల్పడ్డ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: మైనర్ బాలుడిపై తన స్నేహితులే లైంగిక దాడి(Sexually Assaulted)కి పాల్పడ్డ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగింది. ఘటన ప్రకారం రుద్రాపూర్ పోలీస్ స్టేషన్ (Rudrapur Police Station) పరిథిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల మైనర్ బాలుడిని తన ముగ్గురు స్నేహితులు పని పేరుతో ముంబై(Mumbai) తీసుకెళ్లారు. అక్కడే మత్తు మందు ఇచ్చి బాలుడిపై అత్యాచారానికి(Rape) పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన బాలుడు స్వగ్రామానికి తిరిగి వచ్చి, కుటుంబసభ్యులకు విషయం తెలియజేశాడు.
దీంతో కుటుంబసభ్యులు బాలుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులలో ఓ వ్యక్తి మైనర్ కావడం గమనార్హం. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ఎస్పీ విక్రాంత్ వీర్(SP Vikrant Veer) మాట్లాడుతూ.. బాలుడిపై అత్యాచారానికి ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని, కానీ బాలుడు ముగ్గురు వ్యక్తులు అని చెబుత్తున్నాడని తెలిపారు. అలాగే నిందితులలో ఒకరు మైనర్ బాలుడని, నిందితులు పరారీలో ఉన్నారని, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని ఎస్పీ వెల్లడించారు.






