బలూచ్ లిబరేషన్ ఆర్మీకి షాక్.. విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-12 05:03:07  IST  )

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army)కి అగ్రదేశం అమెరికా బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థను ఇక నుంచి విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ తాజాగా అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీకి షాక్.. విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army)కి అగ్రదేశం అమెరికా (America) బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థను ఇక నుంచి విదేశీ ఉగ్రవాద సంస్థ (Foreign terrorist organization)గా గుర్తిస్తూ తాజాగా అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ (Baluchistan) ప్రాంతంలో పనిచేసే జాతీయవాద సాయుధ సంస్థగా బీఎల్‌ఏను 2000 సంవత్సరంలో స్థాపించారు. అయితే, పీవోకే‌తో పాటు పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సక్సెస్‌ఫుల్‌గా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్‌ను బీఎల్‌ఏ (BLA) స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని, తమకుంటూ ఓ జాతీయ పతాకాన్ని కూడా రూపొందించుకుంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా పాకిస్తాన్ సైన్యం, పౌరులు, విదేశీయులపై దాడులు, ఆత్మాహుతి బాంబు దాడులు, కిడ్నాప్‌లు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఇప్పటికే పాకిస్తాన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇరాన్, చైనా, యూరోపియన్ యూనియన్ విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. ప్రస్తుతం ఆ జాబితాలోకి తాజాగా అగ్రరాజ్యం అమెరికా వచ్చి చేరింది. అయితే, గత కొంత కాలంగా పాక్‌కు పక్కలో బల్లెంలా బీఎల్‌ఏ మారింది. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ (Asim Munir) అమెరికా పర్యటన తర్వాత అగ్రరాజ్యం బీఎల్‌ఏ‌ను వీదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Next Story