- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్‌కు షాక్.. బంగ్లాదేశ్‌లోకి నో ఎంట్రీ
ఇస్లాం (Islam) మత ప్రచారకుడు, భారత్ మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ (Zakir Naik)కు బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇస్లాం (Islam) మత ప్రచారకుడు, ఇండియా మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ (Zakir Naik)కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయన తన దేశంలోకి రానివ్వేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. అయితే, బంగ్లాదేశ్ (Bangladesh)లో జాకీర్ నాయక్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు సుదీర్ఘ పర్యటనకు అనుమతి లభించినట్లుగా అక్టోబర్ చివర్లో మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, కేవలం ఒక వారం రోజుల్లోనే ఆ పర్యటన పూర్తిగా రద్దు అయినట్లుగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కాగా, 2016లో ఢాకా (Dhaka) హోలీ ఆర్టిజన్ కేఫ్ (Holly Artisan Cafe) దాడిలో మొత్తం 29 మంది మరణించారు.
అయితే, ఆ దాడి చేసిన ఉగ్రవాదులు జాకీర్ నాయక్ యొక్క పీస్ టీవీ (Peace TV) ప్రసంగాలతో ప్రేరణ పొందినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అప్పటి షేఖ్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఆ ఛానల్‌ను నిషేధించి జాకీర్ నాయక్ బంగ్లాదేశ్‌లోకి రాకుండా నిషేధం విధించింది. ప్రస్తుతం మళ్లీ జాకీర్ నాయక్ బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో తాత్కాలిక ప్రభుత్వం ఆయన రాకను నిషేధించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక భారత్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉగ్రవాదులకు ఫండింగ్, మనీ లాండరింగ్ కేసులతో 2016 నుంచి యాక్టివ్‌గా ఉన్న జాకీర్ నాయక్ మలేషియాలో ఆశ్రయం పొందాడు. ఇంటర్‌పోల్ నుంచి అతడికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు భారత్ ప్రయత్నించినా ఆధారాలు సరిగాలేవంటూ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అభ్యర్థన తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.






